తెలంగాణ

telangana

లంకసాగర్​లో చేపపిల్లలను వదిలిన ఎమ్మెల్యే సండ్ర

By

Published : Oct 11, 2019, 10:15 PM IST

మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపపిల్లలను పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే సండ్ర జలాశయంలో చేప పిల్లలను వదిలారు.

చేప పిల్లలను పెంచే క్షేత్రాన్ని సత్తుపల్లిలో ఏర్పరచాలి : సండ్ర

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకసాగర్ జలాశయంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రాజెక్టులో చేపపిల్లలను వదిలారు. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపపిల్లలను నూరు శాతం రాయితీపై అందిస్తోందన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని 374 చెరువుల్లో మూడు కోట్ల యాభై లక్షల చేపపిల్లలను వదలాల్సి ఉందన్నారు. ఇప్పటికే రెండు కోట్ల 20 లక్షల చేపపిల్లలను నీటిలో వదిలామన్నారు. చేప పిల్లలను పెంచే క్షేత్రాన్ని సత్తుపల్లిలో ఏర్పాటు చేయాలని మత్స్యశాఖ ఉన్నతాధికారులకు సూచించారు.

చేప పిల్లలను పెంచే క్షేత్రాన్ని సత్తుపల్లిలో ఏర్పరచాలి : సండ్ర
ఇవీ చూడండి : ఏడోరోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details