ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఏరుగట్లలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. మానవుడు చేసిన ప్రకృతి విధ్వంసానికి అడవుల్లో ఉండాల్సిన జీవరాసులు గ్రామాల్లో దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని మొక్కలు నాటామనది కాకుండా ప్రతి మొక్కను బతికించేటట్లు పెంచాలని సూచించారు. ఆకుపచ్చని తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇది మానవుని విధ్వంస ఫలితమే: సండ్ర - haritha
ఖమ్మం జిల్లా ఏరుగట్లలో హరితహారం కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. నాటిన ప్రతి మొక్కను బతికించుకోవాలని ఆయన సూచించారు.
ఇది మానవుని విధ్వంస ఫలితమే: సండ్ర