తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెలంగాణ ఉద్యమంలో భూక్య పోరాటం ఎనలేనిది' - Khammam district latest news

తెలంగాణ ఉద్యమకారుడు భూక్య నాగేశ్వరరావు కుటుంబాన్ని ఎమ్మెల్యే రాములు నాయక్ పరామర్శించారు. వారికి ఆర్థిక సహాయం అందించారు. ఉద్యమంలో నాగేశ్వరరావు కీలకంగా పని చేశారని గుర్తు చేశారు.

MLA Ramulu Nayak visits Bhukia Nageswararaos family
భూక్య నాగేశ్వరరావు కుటుంబాన్ని ఎమ్మెల్యే రాములు నాయక్ పరామర్శ

By

Published : Feb 10, 2021, 9:43 AM IST

అనారోగ్యంతో మరణించిన తెలంగాణ ఉద్యమకారుడు, ఖమ్మం జిల్లా కారేపల్లి మండలానికి చెందిన భూక్య నాగేశ్వరరావు కుటుంబాన్ని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పరామర్శించారు. మలివిడిత ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారని గుర్తు తెచ్చుకున్నారు.

తెలంగాణ పోరాట ఆకాంక్షను వైరా నియోజకవర్గ వ్యాప్తంగా తీసుకొచ్చిన ఉద్యమకారుడు నాగేశ్వరరావు అని ఎమ్మెల్యే కొనియాడారు. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలుపుతూ ఆర్థిక సహాయం అందిచారు.

ఇదీ చూడండి:'కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details