రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజక వర్గం కేంద్రంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొన్నారు. తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
'రాష్ట్ర అభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయం' - graduates mlc election Election campaign
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఘతన సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో చేపట్టిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
'రాష్ట్ర అభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయం'
నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. పేదల కోసం ఆయన ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. తెరాస పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫేడ్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, పురపాలక ఛైర్మన్ జైపాల్, వైస్ ఛైర్మన్ సీతారాములు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.