ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని ఏనుకూరు, జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా పరీక్షలు వ్యాక్సినేషన్ ప్రక్రియలను స్వయంగా పరిశీలించారు . ఆయా మండలాల్లో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు సంఖ్య, రికవరీలను గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
పీహెచ్సీలను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్ - పీహెచ్సీ సెంటర్లను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన సేవలు అందిస్తూ రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అధికారులకు సూచించారు .
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే
తెలంగాణ ప్రభుత్వం కరోనా నియంత్రణతో పాటు బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం అందించే దిశగా అన్ని ఏర్పాట్లు చేసిందని ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందిస్తూ... రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కరోనా కట్టడిలో భాగంగా పోలీస్, వైద్య సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి:కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో
TAGGED:
mla ramulu nayak latest news