ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం రెడ్డిగూడెంలో ఇటీవల మృతి చెందిన తెరాస కార్యకర్త ఆది నారాయణరెడ్డి కుటుంబానికి రూ.2 లక్షల ప్రమాద బీమా చెక్కును వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అందజేశారు. ఆదినారాయణ విద్యుతాఘాతంతో మృతి చెందగా.. ఆయన పార్టీ సభ్యత్వం ద్వారా వచ్చిన ప్రమాద బీమాను బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ప్రమాద బీమా చెక్కును అందజేసిన ఎమ్మెల్యే రాములు నాయక్ - ఎమ్మెల్యే రాములు నాయక్ తాజా వార్తలు
ఖమ్మం జిల్లా రెడ్డిగూడెంలో ఇటీవల మృతి చెందిన తెరాస కార్యకర్త ఆది నారాయణరెడ్డి కుటుంబానికి ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రమాద బీమా చెక్కును అందజేశారు. అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ప్రమాద బీమా చెక్కును అందజేసిన ఎమ్మెల్యే రాములు నాయక్
కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ గుమ్మా రోశయ్య, తెరాస మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం.. వసతి గృహానికీ మంటలు