తెలంగాణ

telangana

ETV Bharat / state

వైరాలో రైతులకు విత్తనాలు పంపిణీ - వైరాలో జీలుగులు, పిల్లిపెసల విత్తనాలు పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని అంశాల్లో వెన్నుదన్నుగా ఉంటూ వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే రాములు నాయక్ పేర్కొన్నారు.

seeds distribution in wyra
వైరాలో జీలుగులు, పిల్లిపెసల విత్తనాలు పంపిణీ

By

Published : May 23, 2020, 2:26 PM IST

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వైరాలో రైతులకు జీలుగులు, పిల్లిపెసల విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాములు నాయక్, మార్క్​ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, పురపాలక, మార్కెట్ ఛైర్మన్​లు జైపాల్​, రోశయ్యలు హాజరయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వ సూచనలతోపాటు వ్యవసాయ అధికారులు, శాస్రవేత్తల సలహాలు పాటిస్తూ కర్షకులు అధిక దిగుబడులు పొందాలని ఎమ్మమెల్యే రాములు నాయక్ అన్నారు. కరోనా సమయంలోనూ రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అండగా నిలిచారని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల ఇబ్బందులు తీర్చారని పేర్కొన్నారు. మార్క్​ఫెడ్‌ ద్వారా మొక్కజొన్నల కొనుగోలులోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామని ఆ శాఖ వైస్‌ ఛైర్మన్‌ రాజశేఖర్‌ పేర్కొన్నారు.

ఇవీ చూడండి:'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'

ABOUT THE AUTHOR

...view details