రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి అండగా నిలుస్తోందని వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గోపవరంలో రైతులకు రూ. కోటి విలువైన పంట రుణాల చెక్కులను 217 మంది లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాములు నాయక్తో పాటు డీసీసీబీ ఛైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ ఛైర్మన్ పాల్గొన్నారు.
217 మంది లబ్ధిదారులకు పంట రుణం చెక్కుల పంపిణీ - వైరాలో చెక్కుల పంపిణీ వార్తలు
ఖమ్మం జిల్లా గోపవరంలో ఎమ్మెల్యే రాములు నాయక్ పంట రుణాల చెక్కులను అందజేశారు. 217 మంది లబ్ధిదారు రైతులకు రూ. కోటి విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
217 మంది లబ్ధిదారులకు పంట రుణం చెక్కుల పంపిణీ
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. సహకార సంఘాల ద్వారా వడ్డీలేని రుణాలను అందించి రైతులను ఆదుకుంటున్నారన్నారు. అన్నదాతలు పండించిన పంటలకు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు.
ఇదీ చదవండి :గొంతులో పల్లీ ఇరుక్కుని పదకొండు నెలల చిన్నారి మృతి