తెలంగాణ

telangana

ETV Bharat / state

Mla Dance: సర్పంచి వివాహ వేడుకలో ఎమ్మెల్యే డాన్స్ - వివాహంలో చిందేసిన ఎమ్మెల్యే రాములు నాయక్

ఎప్పుడూ వార్తల్లో ఉండే వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మరోసారి ప్రత్యేకతను చాటుకున్నారు. తన నియోజకవర్గం పరిధిలోని ఓ సర్పంచి వివాహానికి హజరైన ఆయన డాన్స్​ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న స్థానిక నాయకులు, బంధువులు ఈలలు, చప్పట్లతో ఎమ్మెల్యేను మరింత ఉత్సాహపరిచారు.

MLA Ramulu Nayak danced at Sarpanch marriage
వివాహంలో చిందేసిన ఎమ్మెల్యే రాములు నాయక్

By

Published : Jun 29, 2021, 8:10 PM IST

Updated : Jun 29, 2021, 9:59 PM IST

వివాహంలో చిందేసిన ఎమ్మెల్యే రాములు నాయక్

వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని పాటిమీది గుంపు గ్రామ పంచాయతీ సర్పంచి వివాహ వేడుకకు హాజరైన ఆయన డాన్స్​ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.

జిల్లాలోని పాటిమీది గుంపు గ్రామపంచాయతి సర్పంచి బానోత్​ శంకర్​- బిందు వివాహ వేడుకకు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ హాజరయ్యారు. తొలుత నూతన వధువరులను ఆశీర్వదించిన ఆయన అక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులతో కాసేపు ముచ్చటించారు. కొద్దిసేపటి తర్వాత అక్కడ డాన్స్​ చేస్తున్న వారితో జత కలిసి ఆయన కూడా చిందులేశారు. ఎమ్మెల్యే డాన్స్​ చూసిన స్థానిక నాయకులు, బంధువులు ఈలలు, చప్పట్లతో మరింత ఉత్సాహపరిచారు.

ఇదీ చదవండి:CP Anjani kumar: 'ద్విచక్ర వాహనంపై ఇద్దరు ప్రయాణిస్తే ఇద్దరూ హెల్మెట్​ ధరించాల్సిందే'

Last Updated : Jun 29, 2021, 9:59 PM IST

ABOUT THE AUTHOR

...view details