తెలంగాణ

telangana

ETV Bharat / state

'పల్లె ప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి' - వైరా ఎమ్మెల్యే రాములు నాయక్​

రాష్ట్రాన్ని సంపూర్ణంగా పారిశుద్ధ్యంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్​ ప్రజలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ఏన్కూరు మండలం గార్ల ఒడ్డులో ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.

MLA Ramulu Naik Tour In  Waira
పల్లె ప్రగతిలో అందరూ పాల్గొనాలి : ఎమ్మెల్యే రాములు నాయక్

By

Published : Jun 2, 2020, 6:58 PM IST

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాములు నాయక్​ పల్లె ప్రగతిలో భాగంగా ప్రత్యేక పారిశుద్ద్య వారోత్సవాల్లో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తిరిగి పారిశుద్ధ్య పనులు, మురుగు కాలువలు పరిశీలించారు. పల్లె ప్రగతిలో భాగంగా ఏన్కూరు మండలం గార్లఒడ్డులో ప్రత్యేక పారిశుద్ధ్య పనుల్లో ఆయన పాల్గొన్నారు.

గ్రామాలలో తిరిగి సీజనల్​ వ్యాధులు వ్యాపించకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే చెప్పారు. సీజనల్​ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. లాక్​డౌన్​ సమయంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో వెనకడుగు వేయలేదని తెలిపారు. కరోనా నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని అధికారులు ప్రజలకు సూచించారు.

ఇదీ చదవండి:'తెలంగాణకు కేసీఆర్ దేవుడిచ్చిన వరం

ABOUT THE AUTHOR

...view details