MLA Ramulu Naik Fires on Minister Puvvada Ajay ఖమ్మం కారులో ఖయ్యం మీరిలాగే చేస్తే గుణపాఠం తప్పదు Wyra MLA Ramulu Naik Fires on Minister Puvvada Ajay Kumar : ఖమ్మం జిల్లా వైరాలో బీఆర్ఎస్లో మరోసారి వర్గపోరు బహిర్గతమైంది. దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో తనకు ప్రాధాన్యత లేకుండా చేశారని సిట్టింగ్ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్(Wyra MLA Lavudya Ramulu Naik) ఎదురుదాడికి దిగారు. బీఆర్ఎస్ టిక్కెట్ రాక నిరాశతో ఉన్న తనకు మూడు నెలల ఎమ్మెల్యే పదవి ఉన్నా ప్రభుత్వ పథకాల పంపిణీలో కూడా తనకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
MLA Ramulu Naik vs EX MLA Madan Lal :నియోజకవర్గానికి 1,100 యూనిట్లు మంజూరు కాగా.. తనకు 600, బీఆర్ఎస్ టిక్కెట్(BRS MLA Ticket) దక్కించుకున్న మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్‌కు 500 కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు టిక్కెట్ రాకుండా చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలు తనకు రాకుండా చేసేది మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Minister Puvvada Ajay Kumar) అని పరోక్షంగా విమర్శించారు. పది నియోజవకర్గాల్లో ఎక్కడా లేని విధంగా తనపై కక్ష సాధిస్తున్నారని ఆరోపణ చేశారు. మంత్రిని పరోక్షంగా విమర్శలు చేస్తుండగా.. కార్యకర్తలు పువ్వాడ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు.
Khammam BRS Election Plan 2023 : ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ సన్నద్ధం.. ముఖ్య నేతలకు నియోజకవర్గాల ఇన్‌ఛార్జీ బాధ్యతలు
MLA Ramulu Naik Sensational Comments On Minister Puvvada :వైరాలో దళితబంధు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అధికార బీఆర్ఎస్లో ఒక్కసారిగా చిచ్చు రేపింది. సిట్టింగ్ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ప్రతిపాదనలు తయారు చేయగా వాటిని కాదని బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్(EX MLA Madan Lal) వర్గీయులకు కేటాయించడంతోవిబేదాలు తలెత్తాయి. ఈ విషయంపై తన వర్గీయుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే రాములు నాయక్ మార్కెట్‌యార్డులో ఐదు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.
Khammam MLA Ticket Issues : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ జోష్.. గులాబీ గూటికి చేరిన వారందరికీ టికెట్లు
ఈ సమావేశంలో మంత్రి పువ్వాడతో పాటు, మదన్‌లాల్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టిక్కెట్ రాకున్నా పార్టీ గెలుపుకు కృషి చేస్తానని, అభ్యర్థికి స్వాగతం పలికానని బావా అని వచ్చి తనకు కుచ్చుటోపి పెడుతున్నారని మదన్‌లాల్‌పై ఆరోపణ చేశారు. రాజ్యాంగం తనకు ఇచ్చిన హక్కును పదవి ఉన్నన్ని రోజులైనా ఉండనివ్వడం లేదని ఆవేదన చెందారు. తనకు టిక్కెట్ రాకుండా చేసిన పెద్దమనిషే ఇదంతా చేస్తున్నారని పైన రాజు, యువరాజు తనకు అన్యాయం చేయగా.. ఇక్కడున్న సామంతరాజు తనపై కక్ష సాధిస్తున్నారని పువ్వాడను పరోక్షంగా విమర్శించారు.
MLA Ramulu Naik Serious On Minister Puvvada Ajay :గిరిజనులపై చిచ్చుపెట్టేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారని ఘాటు వ్యాఖ్యాలు చేశారు. ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా మంత్రి వైరాలో రాజకీయం చేస్తున్నారన్నారు. తనొక్కడే గెలిచి మళ్లీ మంత్రి కావాలని చూస్తున్నారని, జిల్లాలో ఉన్న అందరి ఎమ్మెల్యేల వలే తనను చూడాలని తనను టార్గెట్ చేసి రాజకీయ చలి కాచుకోవాలంటే తగిన గుణపాఠం చెబుతామని మంత్రి పువ్వాడకు సవాల్ విసిరారు. ఎమ్మెల్యే మాట్లాడుతుండగా.. చివరి వరకు అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మండలాల వారీగా పలువురు నాయకులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారు.
Internal Conflicts Between Khammam BRS Leaders : ఎవరికి వారే అన్నట్లుగా ఉమ్మడి ఖమ్మం బీఆర్ఎస్ నేతల తీరు.. అధినేత స్పెషల్ ఫోకస్
Political Heat in Khammam District : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రసవత్తర సమరం.. అసెంబ్లీ పోరుకు సై అంటే సై