ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాములు నాయక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
చెక్కులు పంచిన ఎమ్మెల్యే రాములు నాయక్ - ఖమ్మం జిల్లా వార్తలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ అండగా ఉంటుందని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. వైరా క్యాంపు కార్యాలయంలో వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు.
చెక్కులు పంచిన ఎమ్మెల్యే రాములు నాయక్
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. పేదింటి ఆడపిల్ల పెళ్లి భారం కావద్దని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఇదీ చూడండి :ప్రతిధ్వని: స్కూళ్లు తెరుచుకుంటాయా.. తరగతుల నిర్వహణ సాధ్యమేనా?