ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పాటిమీదగుంపు గ్రామంలో వలస కూలీలకు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేశారు. కారేపల్లికి చెందిన ఎన్నారై గుడుపుడి తిరుమలరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
వలసకూలీలకు ఎన్నారై సేవాగుణం.. ఎమ్మెల్యే నిత్యావసరాల పంపిణీ - కారేపల్లి తాజా వార్త
ఖమ్మం జిల్లా కారేపల్లిలోని వలస కూలీలను ఆదుకునేందుకు ఎన్నారై తిరుమల రావు ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొని వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
వలసకూలీలకు ఎన్నారై సేవాగుణం.. ఎమ్మెల్యే నిత్యావసరాల పంపిణీ
ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ ప్రభుత్వ నిబంధనలను పాటించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. లాక్డౌన్ నేపథ్యంలో సాయం చేసేందుకు ముందుకొస్తున్న దాతలను ఆయన అభినందించారు.
ఇదీ చూడండి :మీరు నీలిచిత్రాలు చూస్తున్నారా... జాగ్రత్త