తెలంగాణ

telangana

ETV Bharat / state

Ramulu naik: 'జర్నలిస్టుల సంక్షేమం కోసం సీఎం కృషి' - ఎమ్మెల్యే రాములు నాయక్ న్యూస్

ఖమ్మం జిల్లా వైరా, ఏనుకూరు మండలాల్లో ఎమ్మెల్యే రాములు నాయక్ (Ramulu naik) పర్యటించారు. వైరా క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు

mla
mla

By

Published : Jun 8, 2021, 9:59 PM IST

అన్ని రంగాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ (Ramulu naik) అన్నారు వైరా, ఏనుకూరు మండలాల్లో ఆయన పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైరా క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు. ఏనుకూరులో తెరాస మండల కమిటీ ఆధ్వర్యంలో పాత్రికేయులకు శానిటైజర్ లో మాస్కులు పంపిణీ చేశారు.

కరోనా నియంత్రణలో జర్నలిస్టుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారన్నారు. సమాజానికి కరోనాపై అవగాహన కల్పించడం, జాగ్రత్తలు పాటించడం వంటివాటిపై జర్నలిస్టులు, ప్రసార మాధ్యమాలు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు.

ABOUT THE AUTHOR

...view details