రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసం సీఎం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని వాటిని రైతులు అందరికీ అందేలా అధికారులు కృషి చేయాలని అన్నారు.
మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాములు నాయక్ - vyra mirchi yard latest news
ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. వాటిని రైతులు అందరికీ అందేలా అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. పంటను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని రైతులకు సూచించారు.
శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకున్న మిర్చిని.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మన్ జైపాల్, మార్కెట్ ఛైర్మన్ గుమ్మా రోశయ్య, జిల్లా మార్కెటింగ్ శాఖ సెక్రెటరీ నాగరాజు, మార్కెట్ కమిటీ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కూల్చివేత ఎఫెక్ట్: ఆలయం, మసీదు దెబ్బతినటంపై సీఎం విచారం