లాక్డౌన్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సేవలు అభినందనీయమని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం శివారు మేడిశెట్టివారి పాలెం రోడ్డులో గల వాహన తనిఖీ కేంద్రం వద్ద ప్రభుత్వ అధికారులపై ఎమ్మెల్యే పూలు చల్లుతూ ఘనంగా సత్కరించారు. తహసీల్దార్ మీనన్, ఏసీపీ వెంకటేష్, ఎంపీడీవో చిట్యాల సుభాషిని, పురపాలక సంఘం కమిషనర్ సుజాత, సీఐలు రమాకాంత్, కరుణాకర్, ఎస్సై నరేష్, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలకు ఎమ్మెల్యే శాలువా కప్పి పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు.
ప్రభుత్వ ఉద్యోగులు, ఆశా కార్యకర్తలకు ఎమ్మెల్యే పుష్పాభిషేకం - lockdown in telangana
ఖమ్మం జిల్లా గంగారం శివారులో వాహన తనిఖీ కేంద్రం వద్ద ప్రభుత్వ అధికారులపై ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పూలు చల్లుతూ ఘనంగా సత్కరించారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న సర్కారు ఉద్యోగుల సేవలు అభినందనీయమని అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు, ఆశా కార్యకర్తలకు ఎమ్మెల్యే పుష్పాభిషేకం
నియోజకవర్గంలోని తనిఖీ కేంద్రాలతో పాటు, లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, వైద్య, రెవెన్యూ ఉద్యోగులు మొత్తం 300 మందికి ఆహార పొట్లాలను అందజేశామని తెలిపారు. అనంతరం ఉద్యోగులతో కలిసి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సహపంక్తి భోజనం చేశారు.
ఇవీ చూడండి:సీపీఐ నారాయణకు.. ఉపరాష్ట్రపతి ఫోన్