పినపాక, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు తీరు అనైతికమని సీతక్క విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై నిందలు వేసి తెరాస పార్టీకి వత్తాసు పలకడం మానుకోవాలని వనమా వెంకటేశ్వరరావు హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే అండ అని ఎమ్మెల్యేలు తెలిపారు.
ఎమ్మెల్యేలు గో బ్యాక్.. - rega kantharao
మణుగూరు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్య, వనమా వెంకటేశ్వరరావులను రేగా కాంతారావు వర్గీయులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేలు గో బ్యాక్ అంటూ ఆందోళన చేశారు. పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పెరిగిపోవటంతో పోలీసులు ఎమ్మెల్యేలను సింగరేణి అతిథి గృహానికి తరలించారు.
ఎమ్మెల్యేలను అడ్డుకున్న రేగా వర్గీయులు
ఇవీ చదవండి: 'అత్యవసర సమావేశం'