ఖమ్మం జిల్లా ఏన్కూరు వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రారంభించారు. మార్కెట్లో కొత్తగా ఏర్పడిన పాలకమండలి సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - ఏన్కూరులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాములు నాయక్
ఖమ్మం జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రారంభించారు.
పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
సీసీఐ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాములు నాయక్ సూచించారు. రైతులు పత్తిలో తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకుని మార్కెట్లు తీసుకురావాలన్నారు. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: దిశ ఎన్కౌంటర్తో వెల్లివిరిసిన ఆనందం