తెలంగాణ

telangana

ETV Bharat / state

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

ఖమ్మం జిల్లా కొణిజర్లలో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఇద్దరు కూలీలు మరణించిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. మృతుల కుటుంబాలను వైరా శాసన సభ్యులు లావుడియా రాములు నాయక్​ పరామర్శించారు. చనిపోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

MLA Lavudia nayak Condolance to labour family
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

By

Published : Aug 3, 2020, 5:27 PM IST

ఖమ్మం జిల్లా కొణిజర్లలో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి చనిపోయిన ఇద్దరు కూలీల కుటుంబాలను వైరా శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ పరామర్శించారు. చనిపోయిన బండారు మల్లిక, తుప్పతి రమాదేవిల మృతదేహాలను సందర్శించి నివాళి అర్పించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సహాయం అందే విధంగా చొరవ చూపుతానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేతో పాటు.. ఎంపీపీ గోసు మధు, సర్పంచి సూరంపల్లి రామారావు, సొసైటీ ఛైర్మన్‌ చెరుకుమల్లి రవి, సుడా డైరెక్టర్ బండారు కృష్ణ, ఎంపీటీసీ కొనకంచి స్వర్ణ లతా, వైరా మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాయల పుల్లయ్య, తెరాస నాయకులు కోసూరి శ్రీనివాసరావు, ఏలూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details