ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ను పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ప్రారంభించారు. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రికార్డుల నమోదు, నిర్వహణలో సరికొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆయన అన్నారు. స్లాట్ బుకింగ్ నుంచి పాస్‌బుక్ పొందే వరకు అన్నీ ఆన్‌లైన్‌లో పొందే అవకాశం ధరణి పోర్టల్ అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.
ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు - ఖమ్మం జిల్లా తాజా వార్తలు
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ను పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ప్రారంభించారు. ధరణిలో పోర్టల్‌లో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల వివరాలు ఒకేచోట లభించనున్నాయని ఆయన తెలిపారు.
ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
వైరా, సత్తుపల్లి నియోజకవర్గంలోని తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి పోర్టల్‌ను ఎమ్మెల్యేలు రాములు నాయక్, సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించారు. ఏ ప్రాంతంలో ఉన్నా ప్రత్యేక స్లాట్ ద్వారా తమ భూములను నమోదు చేసుకునే విధంగా ప్రణాళిక రూపొందించారని వారు అన్నారు.
ఇదీ చూడండి :'ధరణి'లో స్లాట్ బుకింగ్ ఎలా చేయాలో... తెలుసుకుందాం