భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ప్రారంభించారు. జిల్లాలో వ్యాక్సిన్ వేస్తున్న 4 కేంద్రాలలో ఇల్లెందు కేంద్రం ఉందని తెలిపిన ఆమె.. కొవిడ్ వ్యాక్సిన్ ఏర్పాట్లను పరిశీలించారు.
ఆందోళన వద్దు..
ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో 30 మందికి వ్యాక్సిన్ అందించేలా వైద్యాధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి వ్యాక్సిన్ ఆశ వర్కర్ ఉమాదేవి తీసుకోగా.. ప్రజా ప్రతినిధులు అధికారులు ఆమెను అభినందించారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు 30 నిమిషాలపాటు ఎటువంటి ఆందోళన లేకుండా ఉండాలని వైద్యాధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ భాస్కర్ నాయక్, పురపాలక ఛైర్మన్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మస్తాన్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వైద్యులు వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:భవిష్యత్‌కు ఆశాకిరణం.. కొవిడ్ వ్యాక్సిన్ : మంత్రి కేటీఆర్