ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో 500 మంది వలస కూలీలు, గొర్రెల పెంపకందారులు, వికలాంగులకు ఎమ్మెల్యే హరిప్రియనిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రభుత్వానికి ప్రజలు సహకరించండి: ఎమ్మెల్యే హరిప్రియ - CORONA EFFECTS
ఇల్లెందు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వలస కూలీలు, గొర్రెల పెంపకం దారులకు ఎమ్మెల్యే హరిప్రియ నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు.

ప్రభుత్వానికి ప్రజలు సహకరించండి: ఎమ్మెల్యే హరిప్రియ
ప్రభుత్వం లాక్డౌన్ పొడిగించినందున ప్రజలు సహకరించాలని ప్రజలను ఎమ్మెల్యే కోరారు. పలువురు దాతలు స్వచ్ఛంద సంస్థలు నిరుపేదలను ఆదుకోవటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ మల్లిబాబు యాదవ్, ఎంపీపీ సునీత, పీఎసీఎస్ అధ్యక్షులు హనుమంతరావు, వైస్ ఎంపీపీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.