ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలంలోని కిష్టాపురంలో కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ విధించారు. ఆ సమయంలో కిష్టాపురంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో స్థానిక ఎస్ఐ సతీష్ కుమార్ ముగ్గురు వ్యక్తులను విచక్షణ రహితంగా కొట్టారు.
'ఇలాంటి ఘటనల వల్ల వారికి చెడ్డ పేరు వస్తోంది' - ఎమ్మెల్యే భట్టి విక్రమార్క వార్తలు
లాక్ డౌన్ సమయంలో ముదిగొండ మండలం కిష్టాపురంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ... వారిని విచక్షణ రహితంగా కొట్టిన ఘటనను మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఖండించారు.
'ఇలాంటి ఘటనల వల్ల వారికి చెడ్డ పేరు వస్తోంది'
ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్క స్పందించారు. సదరు వ్యక్తులను కృష్ణాపురంలో పరామర్శించారు. లాక్డౌన్ సందర్భంగా పోలీస్ అధికారులు, డాక్టర్లు మంచిగా విధులు నిర్వహిస్తున్నారని... కానీ ఇలాంటి ఘటనల వల్ల వారికి చెడ్డ పేరు వస్తుందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
ఇవీచూడండి:పేదలపై లాక్డౌన్ ప్రభావం.. జాగ్రత్త పడకపోతే అంతే!