తెలంగాణ

telangana

ETV Bharat / state

సరిహద్దుల్లో చెక్​పోస్టులను తనిఖీ చేసిన సీపీ, ఎమ్మెల్యే

లాక్​డౌన్ ప్రభావంతో ఖమ్మంలో కొవిడ్​ కేసులు తగ్గుముఖం పట్టాయని సీపీ విష్ణు వారియర్​ అన్నారు. రాష్ట్ర సరిహద్దులోని పెనుబల్లి మండలం ముత్తగూడెం చెక్​పోస్టును సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి సందర్శించారు.

Telangana news
ఖమ్మం జిల్లా వార్తలు

By

Published : May 26, 2021, 10:41 PM IST

ఖమ్మం జిల్లాలో ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో 43 చోట్ల చెక్​పోస్టులను ఏర్పాటు చేశామని సీపీ విష్ణు వారియర్​ అన్నారు. పెనుబల్లి మండలం ముత్తగూడెం చెక్​పోస్టును ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి సందర్శించారు. ఆశా వర్కర్లకు మాస్కులు, శానిటైజర్, మంచి నీళ్ల బాటిళ్లు అందించారు.

స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాల్లోనూ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. లాక్​డౌన్ సమయంలో ఎవరూ బయటకురావొద్దని అన్నారు. లాక్​డౌన్​ సందర్భంగా పెళ్లిళ్లు, జాతరలు నిర్వహించడం శ్రేయస్కరం కాదన్నారు. కొవిడ్​ కట్టడిలో పోలీసులు సేవలు కీలకమని ఎమ్మెల్యే సండ్ర అన్నారు. సరిహద్దుల్లో మద్యం దుకాణాలు మూసివేసినట్లు వివరించారు. కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్​, సీఐ కరుణాకర్​, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ED: బియ్యం వ్యాపారి ఆస్తులు అటాచ్‌ చేసిన ఈడీ

ABOUT THE AUTHOR

...view details