తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మంలో యువ ఇంజినీర్ల ఆందోళన - ఖమ్మంలో యువ ఇంజినీర్ల ఆందోళన

ఖమ్మం జిల్లా కేంద్రంలో యువ ఇంజినీర్లు ఆందోళన చేశారు. తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. 2016లో మిషన్ భగీరథ తాగునీటి పథకానికి పొరుగు సేవల కిందలో తమను తీసుకున్నారని తెలిపారు. ఇప్పుడు పథకం పనులు పూర్తవడం వల్ల తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఖమ్మంలో యువ ఇంజినీర్ల ఆందోళన
ఖమ్మంలో యువ ఇంజినీర్ల ఆందోళన

By

Published : Jul 1, 2020, 10:18 PM IST

ఖమ్మంలో యువ ఇంజినీర్లు ధర్నా నిర్వహించారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథ తాగునీటి పథకంలో 662 మంది యువ ఇంజినీర్లు, 42 మంది జూనియర్ అసిస్టెంట్లను విధుల్లో నుంచి తొలగించినట్లు వాపోయారు.

బుధవారం నుంచి వారిని విధులకు హాజరు కావద్దని చెప్పారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ఉద్యోగులందరినీ 2016లో పొరుగు సేవల కింద వారిని తీసుకున్నారని.. పథకం పనులు పూర్తి కావటం వల్ల వారిని తొలగిస్తున్నట్లు చీఫ్ ఇంజినీరు తెలిపారు. తాము ఇప్పుడు ఎక్కడికి పోలేమని.. ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్‌ కిక్కు.. ఒక్కరోజే డబుల్

ABOUT THE AUTHOR

...view details