తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒక్కరోజే రూ.5వేలు తగ్గిన మిర్చి ధర.. ఖమ్మంలో ఉద్రిక్తత..

ఖమ్మం మార్కెట్​ యార్డులో మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. క్వింటాలుకు ధర ఒక్క రోజే రూ.5వేలు తగ్గడంతో భగ్గుమన్నారు. దళారులు మోసాలపై నిరసనకు దిగారు.

mirchi farmers protest in khammam
ఖమ్మం మిర్చి యార్డులో రైతుల ఆందోళన

By

Published : Jan 30, 2020, 10:08 AM IST

ఖమ్మం మార్కెట్​ యార్డు​లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మిర్చి ధర ఒకేసారి రూ. 5000 తగ్గించడం వల్ల రైతులు మార్కెట్ గేటు మూసివేసి మరీ ఆందోళనకు దిగారు. మార్కెట్​ ఛైర్మన్​ను చుట్టుముట్టి ధర పెంచాలని డిమాండ్ చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రైతులను అడ్డుకుని ఛైర్మన్​ను తన కార్యాలయానికి సురక్షితంగా తరలించారు.

నిన్నటి వరకు క్వింటాలుకు రూ.18వేలు ఉన్న ధర.. ఇవాళ ఒక్కసారిగా 13వేలకు ఎలా తగ్గుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. యార్కెట్ యార్డ్ అధికారులు తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఖమ్మం మిర్చి యార్డులో రైతుల ఆందోళన

ఇదీ చూడండి: పద్దు 2020: నిర్మల బడ్జెట్​తో 'ఆటో' గేర్​ మారుతుందా?

ABOUT THE AUTHOR

...view details