రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఆర్టీసీ అధికారులు తీసుకుంటున్న కరోనా నివారణ చర్యలు... ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలు తెలుసుకునేందుకు ఖమ్మంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు.
జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రయాణిస్తున్నారు: మంత్రి పువ్వాడ - మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తాజా వార్తలు
ఖమ్మం ఆర్టీసీ బస్టాప్‌లో కరోనా నియంత్రణ నిబంధనలు పాటిస్తున్నారా? లేదా ? అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రయాణిస్తున్నారని ఆయన తెలిపారు. బస్సులో సిబ్బంది నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రయాణిస్తున్నారు: మంత్రి పువ్వాడ
ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రయాణిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రతి బస్సులో కండక్టర్, డ్రైవర్ దగ్గర హ్యాండ్ శానిటైజర్ ఉండాలని ఆదేశించామన్నారు. అలా లేకుంటే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటున్న మంత్రి అజయ్ కుమార్‌తో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి.
ఇదీ చూడండి:కరోనా రికార్డ్: 24 గంటల్లో 5,611 కేసులు, 140 మరణాలు