తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే పీవీకి భారతరత్న ప్రకటించాలి: కేటీఆర్ - ఖమ్మంలో ఐటీ హబ్​ ప్రారంభం

ఖమ్మంలో మంత్రులు కేటీఆర్​, మహమూద్​ అలీ, పువ్వాడ అజయ్​, ప్రశాంత్​రెడ్డి పర్యటిస్తున్నారు. ఖానాపురం మినీ ట్యాంక్‌బండ్‌, బల్లేపల్లి వైకుంఠధామాన్ని ప్రారంభించారు. రాష్ట్ర నలమూలల ఐటీ రంగం విస్తరణే లక్ష్యంగా ఏర్పాటుచేసిన ఖమ్మంలో నిర్మించిన ఐటీ హబ్​ను మంత్రులు ప్రారంభించనున్నారు.

ktr khammam tour
ఖమ్మంలో మంత్రులు.. పీవీ కాంస్య విగ్రహం ఆవిష్కరణ

By

Published : Dec 7, 2020, 10:33 AM IST

Updated : Dec 7, 2020, 2:22 PM IST

మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్​ ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో తేనీటి విందు అనంతరం ఖానాపురంలో మినీ ట్యాంక్​బండ్​, బల్లేపల్లి వైకుంఠధామాన్ని ప్రారంభించారు. లాకారం ట్యాంక్‌బండ్‌పై మాజీ ప్రధాని పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. రూ.1.25 కోట్లతో పీవీ విగ్రహం ఏర్పాటు చేశారు. అనంతరం పీవీ శతజయంతి సంకలనం పుస్తకాన్ని కేటీఆర్, ఇతర మంత్రులు ఆవిష్కరించారు.

కేంద్రానికి నిబద్ధత, చిత్తశుద్ధి ఉంటే భారతరత్న ప్రకటించాలి. పీవీకి భారతరత్న ఇవ్వడమంటే కేంద్రం తనను తాను గౌరవించుకోవడమే. రాష్ట్ర ప్రజల కోరికా అదే. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో పీవీ కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ సెంట్రల్‌ వర్సిటీకి పీవీ పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరాం.

- కేటీఆర్​

కాసేపట్లో ఐటీ సౌధం సహా ధంసలాపురం రైల్వే వంతెన, పోలీస్ కమిషనరేట్ నూతన భవనం, పలుచోట్ల పార్కులు, పట్టణ ప్రకృతి వనాలు ప్రారంభించనున్నారు. అనంతరం ఐటీ హబ్ ప్రాంగణంలో బహిరంగ సభలో మంత్రులు పాల్గొంటారు.

ఇవీచూడండి:నేడు ఖమ్మంలో కేటీఆర్​ పర్యటన.. సిద్ధమైన నగరం

Last Updated : Dec 7, 2020, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details