తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ దూరదృష్టితో ఐటీ రంగం విస్తరిస్తోంది: నిరంజన్‌రెడ్డి

ఖమ్మం జిల్లా కేంద్రంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, అజయ్‌కుమార్‌ కలిసి నూతనంగా ప్రారంభించిన ఐటీ హబ్‌ను సందర్శించారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగం విస్తరిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం దూరదృష్టితో ఐటీ రంగం విస్తరిస్తోంది: నిరంజన్‌రెడ్డి
ప్రభుత్వం దూరదృష్టితో ఐటీ రంగం విస్తరిస్తోంది: నిరంజన్‌రెడ్డి

By

Published : Dec 13, 2020, 2:58 PM IST

ప్రభుత్వం దూరదృష్టితో రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగం విస్తరిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో సహచర మంత్రి అజయ్‌కుమార్‌తో కలిసి నూతనంగా ప్రారంభించిన ఐటీ హబ్‌ను సందర్శించారు.

16 సంస్థలతో 300 మందికి ఉద్యోగాలు కల్పించటం మంచి విషయమన్న మంత్రి నిరంజన్ రెడ్డి... ఇదే విధంగా రాష్ట్రమంతా ఐటీ సేవలు విస్తరింపజేసి ఎంతో మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందన్నారు.

ఇదీ చదవండి:10 మందిని బలితీసుకున్న రహదారులు

ABOUT THE AUTHOR

...view details