హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయంలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ - గణతంత్ర వేడుకలు
నాంపల్లిలోని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో.. సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్
అనంతరం మంత్రి.. జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో.. సంఘం అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కాంగ్రెస్ త్యాగాలతోనే స్వాతంత్య్రం వచ్చింది: ఉత్తమ్