తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆచార్య జయశంకర్‌ ఆలోచనలతో రాష్ట్రం ముందుకెళ్తోంది' - undefined

తెలంగాణ ప్రభుత్వం ఆచార్య జయశంకర్‌ ఆశయాల సాధనలో ముందుకెళ్తోందన్నారు రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడల శాఖ మాత్యులు శ్రీనివాస్‌గౌడ్‌. ఆచార్య జయశంకర్‌ 85వ జయంతి సందర్భంగా ఖమ్మంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

'ఆచార్య జయశంకర్‌ ఆలోచనలతో రాష్ట్రం ముందుకెళ్తోంది'

By

Published : Aug 6, 2019, 6:11 PM IST

ఆచార్య జయశంకర్‌ ఆశయాల సాధనలో తెలంగాణ ప్రభుత్వం ముందుందని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడల శాఖా మాత్యులు శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఖమ్మం పర్యటనకు వచ్చిన ఆయన ముందుగా ఖానాపురం కరెంటు ఆఫీసు ప్రాంగణంలో ఆచార్య జయశంకర్‌ కాంస్య విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే అజయ్‌ కుమార్​తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆచార్య జయశంకర్‌ ఆలోచనల ప్రకారం ముందుకు పోతున్నారన్నారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి వారి ఆత్మ శాంతించి ఉంటుందన్నారు.

'ఆచార్య జయశంకర్‌ ఆలోచనలతో రాష్ట్రం ముందుకెళ్తోంది'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details