తెలంగాణ

telangana

ETV Bharat / state

పోడు రైతులకు శుభవార్త.. పట్టాల పంపిణీకి డేట్​ ఫిక్స్​.. ఎప్పుడంటే..?

Grant patta to Podu farmers : రాష్ట్రంలోని పోడు రైతులకు మంత్రి సత్యవతి రాథోడ్‌ శుభవార్త చెప్పారు. ఈ జనవరిలోనే పోడు రైతులకు పట్టాలు మంజూరు చేస్తామని ఆమె ప్రకటించారు. ఇప్పటికే గ్రామ, డివిజన్‌ స్థాయిలో దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా మూడు గిరిజన గురుకులాలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆమె వివరించారు.

Minister Satyavati Rathore
Minister Satyavati Rathore

By

Published : Jan 1, 2023, 3:41 PM IST

Grant patta to Podu farmers : రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో పోడు రైతులకు ఈ జనవరిలోనే పట్టాలు మంజూరు చేస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌ స్పష్టం చేశారు. గ్రామ, డివిజన్‌ స్థాయిలో దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని, జిల్లా కమిటీల ఆమోదం తరువాత హక్కులు కల్పిస్తామని వెల్లడించారు. కొత్తగా మూడు గిరిజన గురుకులాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఆదివాసీలకు ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా రాష్ట్రపతికి వివరించినట్లు తెలిపారు.

శనివారం గిరిజన సంక్షేమ భవన్‌లో ఆ శాఖ కార్యదర్శి క్రిస్టీనా, ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్‌, అదనపు డైరెక్టర్‌ సర్వేశ్వర్‌రెడ్డి, సీఈ శంకర్‌, జీసీసీ సీజీఎం సీతారాంనాయక్‌, ట్రైకార్‌ జీఎం శంకర్‌రావుతో కలిసి ఆమె కేక్‌ కట్‌ చేసి మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్‌ చొరవతో రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెరిగాయి. గిరిజన గురుకులాల్లో చదివిన 1,200 మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఉన్నత విద్య చదువుకుంటున్నారు.

గిరిజనుల విదేశీ విద్య కోసం రూ.20 లక్షల ఉపకార వేతనాలు ఇస్తున్నాం. గిరిజన ఆవాసాలకు బీటీ రోడ్డు కోసం రూ.వెయ్యి కోట్లు మంజూరయ్యాయి. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా అంగన్‌వాడీ లబ్ధిదారులైన చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పోషకాహారం అందిస్తున్నాం’’ అని మంత్రి తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details