ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బతుకమ్మ పండుగను అందరూ భక్తిశ్రద్ధలతో ఆడాలని, రాష్ట్ర సంస్కృతిని విదేశాలకు తెలిసేవిధంగా చేయాలని తెలిపారు. మహిళలందరికి చీరలు పంపిణీ చేశారు అజయ్. 30 రోజుల ప్రణాళికలో భాగంగా అందరూ కలిసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
'విదేశాలకు తెలిసేలా బతుకమ్మ నిర్వహించాలి'
బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్.. ఖమ్మం జిల్లా ముదిగొండలో ప్రారంభించారు. విదేశాలకు రాష్ట్ర సంస్కృతి తెలిసేలా బతుకమ్మ పండుగ జరుపుకోవాలని మహిళలకు సూచించారు.
'విదేశాలకు తెలిసేలా బతుకమ్మ నిర్వహించాలి'