హైదరాబాద్ తర్వాత అతి పెద్ద బస్టాండ్ ఖమ్మంలో నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈనెల 27న రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆ బస్టాండ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
అసెంబ్లీ సమావేశాల అనంతరం జిల్లాలో మంత్రుల పర్యటన - minister puvvada latest news
అసెంబ్లీ సమావేశాల అనంతరం ఖమ్మం జిల్లాలో మంత్రుల పర్యటన ఉంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జిల్లాలో పర్యటించిన ఆయన జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన బస్టాండ్‌ను సందర్శించారు. ఈ నెల 23న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆ బస్టాండ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
![అసెంబ్లీ సమావేశాల అనంతరం జిల్లాలో మంత్రుల పర్యటన Minister Puwada toured the khammam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11079129-833-11079129-1616172987289.jpg)
జిల్లాలో పర్యటించిన మంత్రి పువ్వాడ
అసెంబ్లీ సమావేశాల అనంతరం ఖమ్మం జిల్లాలో మంత్రుల పర్యటన ఉంటుందని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. జిల్లాలో పర్యటించిన ఆయన నూతనంగా నిర్మిస్తున్న బస్టాండ్ పనులను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి పనుల గురించి ఆధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి:'ఆ విషయంలో రాష్ట్ర సర్కారు ఎలాంటి ప్రకటన చేయలేదు'