తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్షం వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో భారీ వర్షానికి దెబ్బతిన్న పంటలను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి పరిశీలించారు. దసరా లోపు రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

By

Published : Oct 17, 2020, 8:27 PM IST

minister puvvada visited at crop loss areas
వర్షం వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లిలో తెగిపోయిన ఎల్ఎఫ్ఎ​ల్ మెయిన్​ కాలువను, ఎర్రగుంట్లపాడు, రామన్నపాలెం గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంట కాలువలను, పొలాలను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పరిశీలించారు. పంటలకు జరిగిన నష్టం నివేదికను త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించాలని అధికారులను ఆదేశించారు.

వర్షాలకు దెబ్బతిన్న కాలువలను, రహదారులను తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రజా ఉపయోగంలోకి తీసుకురావాలని మంత్రి సూచించారు. జిల్లాలో 129 క్లస్టర్లలో నిర్మితమవుతున్న రైతు వేదికలను దసరా నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. వరి, పత్తి పంటల కొనుగోలుకు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

ఇదీ చదవండిఃఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details