దిశ ఆత్మకు శాంతి చేకూరిందని భావిస్తున్నానని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మొదటి సారి నేను ఎందుకు పోలీస్ కాలేక పోయానా అని బాధ పడుతున్నానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇలాంటి సత్వర న్యాయం జరుగుతుందని ఎప్పుడూ ధర్మమే గెలుస్తుందని తెలిపారు.
ఈ ఎన్కౌంటర్ ఘటన ద్వారా దేశానికే రాష్ట్రం ఒక రోల్ మోడల్లా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆడపిల్ల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ చూస్తే కళ్లు పీకి చూపిస్తాం అని సీఎం కేసీఆర్ ఒకప్పుడు చెప్పిన మాటలు తూటాల్లాగా ఖచ్చితంగా నెరవేరుతున్నాయని ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుందని పువ్వాడ తెలిపారు.
'నేను పోలీసు ఎందుకు కాలేకపోయానా అని చింతిస్తున్నా' - దిశ కేసులోని నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన పువ్వాడ
దిశ హత్యకేసులోని నిందితులను ఎన్‌కౌంటర్‌పై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పోలీసులను అభినందించారు. తాను ఎందుకు పోలీస్ కాలేకపోయానా అని మొదటిసారిగా చింతిస్తున్నానని పేర్కొన్నారు.
!['నేను పోలీసు ఎందుకు కాలేకపోయానా అని చింతిస్తున్నా' minister-puvvada-talk-on-disha-accused-encounter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5287008-153-5287008-1575621125786.jpg)
'నేను పోలీసు ఎందుకు కాలేకపోయానా అని చింతిస్తున్నా'
'నేను పోలీసు ఎందుకు కాలేకపోయానా అని చింతిస్తున్నా'
ఇదీ చూడండి: దిశ ఘటనా స్థలానికి 400 మీటర్లలోనే ఎన్కౌంటర్
Last Updated : Dec 6, 2019, 2:19 PM IST