వివిధ పనుల నిమిత్తం ఖమ్మం నగరానికి వచ్చిన మహిళలు ఇబ్బంది పడకుండా సంచార టాయిలెట్లను ప్రారంభిస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం కలెక్టరేట్ వద్ద నేడు ఏడు సంచార శౌచాలయాలను ఆయన ప్రారంభించారు.
సంచార శౌచాలయాలను ప్రారంభించిన మంత్రి పువ్వాడ - మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తాజా వార్తలు
ఖమ్మం జిల్లా కేంద్రంలో సంచార శౌచాలయాలను ఏర్పాటు చేశారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. నగరానికి వచ్చే మహిళలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
![సంచార శౌచాలయాలను ప్రారంభించిన మంత్రి పువ్వాడ minister Puvvada started mobile toilets](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8086080-196-8086080-1595146652761.jpg)
సంచార శౌచాలయాలను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
నగరంలో 4 వాహనాలు తిరుగుతాయని.. 3 వాహనాలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వీటితో పాటు మంత్రి కేటీఆర్ సూచన మేరకు నగరంలో సుమారు 140 మూత్రశాలలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ పాపాలాల్, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, కమిషనర్ అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు.
సంచార శౌచాలయాలను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
ఇదీచూడండి: కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ