ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పర్యటించారు. బోనకల్లు, చింతకాని మండలాల్లో రైతు వేదిక భవనాల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్‌రాజు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్, తదితరులు పాల్గొన్నారు.
మధిరలో రైతు వేదికలకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన - అభివృద్ధి పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పర్యటించిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బోనకల్లు, చింతకాని మండలాల్లో రైతు వేదిక భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రైతు వేదికల నిర్మాణం.. నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు.
మధిరలో రైతు వేదికలకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన
తెరాస ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని.. రైతు వేదికల నిర్మాణంతో అన్నదాతలకు కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని మంత్రి పువ్వాడ తెలిపారు. అన్నదాతను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు సీఎం కేసీఆర్ రైతు వేదికలకు సంకల్పించామన్నారు.
ఇదీ చదవండి:ఆడుకున్న ఇంటిని కూల్చేశారు.. ఆడించిన నాన్నను చంపేశారు!