దళిత వర్గాల అభివృద్ధి కోసం నడుం బిగించిన సీఎం కేసీఆర్కు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అండదండగా ఉండాలని... రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఎస్సీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి తీసుకొస్తున్న దళిత సాధికారత పథకానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. పథకాన్ని స్వాగతిస్తూ ఖమ్మం జిల్లాలోని అంబేడ్కర్ సెంటర్ వద్ద దళిత దరువు పేరిట నిర్వహించిన సంబరాల్లో... ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి మంత్రి పాల్గొన్నారు.
ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు...
ముఖ్యమంత్రి దళిత సాధికారత పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు ఆర్థికసాయం అందజేయనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున సాయం అందించనున్నామన్నారు. అనేక విధాలుగా ఎస్సీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. అందరికీ మేలు చేకూర్చే విధంగా ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి చెప్పారు.
దాదాపు రూ.1,200 కోట్ల నిధులు...