భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఇల్లందు జేకే 5 ఉపరితల గని వద్ద 1000 మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. సింగరేణి సంస్థ భారీ ఎత్తున మొక్కలు నాటుతూ అడవులను తలపించేలా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయడం అభినందనీయమన్నారు. సింగరేణి ప్రాంతాల అభివృద్ధి కోసం నిధులను కేటాయిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా చేయూత నివ్వడం హర్షణీయం అన్నారు.
పర్యావరణ పరిరక్షణకు సింగరేణి కృషి అభినందనీయం: పువ్వాడ - minister puvvada planted at singareni
ఇల్లందు జేకే 5 ఉపరితల గని వద్ద 1000 మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. సింగరేణి సంస్థ భారీ ఎత్తున మొక్కలు నాటుతు అడవులను తలపించేలా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయడం అభినందనీయమన్నారు.
వెయ్యి మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి పువ్వాడ
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ, జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఆర్డీఓ స్వర్ణలత, సింగరేణి అధికారులు డైరెక్టర్ భాస్కర్ రావు, జనరల్ మేనేజర్ సత్యనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు.
TAGGED:
minister puvvada