ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రకృతి వనంలో మంత్రి పువ్వాడ అజయ్ మొక్కలు నాటారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ప్రకృతి వనంలో నాటిన మొక్కలను బాధ్యతగా పెంచి మహా వృక్షాలుగా తీర్చి దిద్దాలని సిబ్బందికి సూచించారు. మంత్రితో పాటు ఎమ్మెల్య ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కూడా మొక్కలు నాటారు.
కూసుమంచి ప్రకృతి వనంలో మొక్కలు నాటిన పువ్వాడ - Minister Puvvada
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు పచ్చదనానికి నిలయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి ప్రకృతి వనంలో ఆయన మొక్కలు నాటారు.
కూసుమంచి ప్రకృతి వనంలో మొక్కలు నాటిన మంత్రి పువ్వాడ