ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో తెరాస సీనియర్ నాయకులు బోడెపూడి రమేశ్‌బాబు నాల్గో వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్ విగ్రహావిష్కరణ ఏర్పాటు చేశారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హాజరై.. విగ్రహాన్ని ఆవిష్కరించారు.
రమేశ్ బాబు విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రి పువ్వాడ - Minister Puvvada ajay kumar latest news
ఖమ్మం జిల్లా పండాతాపురంలో తెరాస సీనియర్ నాయకులు బోడెపూడి రమేశ్‌బాబు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి పువ్వాడ హాజరై.. ఆవిష్కరించారు.
రమేశ్ బాబు విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రి పువ్వాడ
ఈ సందర్భంగా రమేశ్‌బాబు విగ్రహానికి మంత్రి పువ్వాడతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు పూలమాలలతో నివాళులర్పించారు. నిబద్దత గల నేతగా బోడెపూడి నిలిచారని మంత్రి కొనియాడారు.
ఇదీ చూడండి: తికమక పెట్టే ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ఎలా చేస్తారో తెలుసా..?