తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం డీసీసీబీకి గొప్ప చరిత్ర ఉంది: మంత్రి పువ్వాడ - latest news on minister puvvada participated in dccb chaiman pramana sweekara programme

ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు వందేళ్ల చరిత్ర ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోనే అత్యంత లాభాల్లో ఉన్న బ్యాంకుగా ఖమ్మం డీసీసీబీ విరాజిల్లుతోందని పేర్కొన్నారు. డీసీసీబీ ఛైర్మన్​ పదవీ బాధ్యతల స్వీకార మహోత్సవానికి ఆయన హాజరయ్యారు.

minister puvvada
ఖమ్మం డీసీసీబీకి గొప్ప చరిత్ర ఉంది: మంత్రి పువ్వాడ

By

Published : Mar 9, 2020, 8:16 AM IST

రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన మొత్తం రైతులు, రైతుల సంక్షేమంపై ఉంటుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. నూతనంగా ఏర్పడిన పాలకమండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఖమ్మం డీసీసీబీకి గొప్ప చరిత్ర ఉందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అత్యంత లాభాల్లో ఉన్న బ్యాంకుగా ఖమ్మం డీసీసీబీ విరాజిల్లుతోందన్నారు. బ్యాంకు చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని.. అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఇతర పాలకమండలి సభ్యులు జాగ్రత్తగా రుణాలు ఇవ్వాలని సూచించారు. అందరి సహకారంతో బ్యాంకును మరింత అభివృద్ధి చేస్తానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఛైర్మన్ కూరాకుల నాగభూషణం తెలిపారు.

ఖమ్మం డీసీసీబీకి గొప్ప చరిత్ర ఉంది: మంత్రి పువ్వాడ

ఇదీ చూడండి: మున్ముందు కాషాయ దళంలో మరిన్ని చేరికలు

ABOUT THE AUTHOR

...view details