Minister Puvvada on Tummala Nageswara Rao :ముఖ్యమంత్రి కేసీఆర్‌పై.. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. పదవుల కోసం తుమ్మల అధమస్థాయికి దిగజారారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ (Puvvada Ajay Kumar) ఆరోపించారు. కేసీఆర్ గురించి ఆయన ఇష్టారీతిన మాట్లాడటం బాధాకరమని అన్నారు. 2014లో మంత్రి పదవి ఇచ్చి ఉండకపోతే తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే రిటైర్ అయ్యేవారని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
BRS Leader Comments on Tummala Nageswara Rao : తుమ్మల నాగేశ్వరరావుపై (Tummala Nageswara Rao) ఆధారపడి కేసీఆర్ అధికారంలోకి వచ్చారా అని పువ్వాడ అజయ్‌కుమార్ ప్రశ్నించారు. కేసీఆర్‌కు మంత్రి పదవి ఇప్పించినట్లు ఆయన ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్, తుమ్మల నాగేశ్వరరావు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారని.. కేసీఆర్‌కు తుమ్మల మంత్రి పదవి ఇప్పించారనేది హాస్యాస్పదమని అన్నారు. ముఖ్యమంత్రి వల్లే తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి వచ్చిందని పువ్వాడ అజయ్‌కుమార్ గుర్తు చేశారు.
తుమ్మల నాగేశ్వరరావు ఓటమికి.. ఉపేందర్‌రెడ్డికి డబ్బులు ఇచ్చినట్లు ఆరోపిస్తున్నారని పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. తుమ్మలకు టికెట్ ఇచ్చి ఓటమి కోసం డబ్బులిస్తారా అని ప్రశ్నించారు. ఆయన టికెట్ ఇచ్చి ఉండకపోతే సరిపోయేది కదా అని అన్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఎప్పుడూ జైతెలంగాణ నినాదం చేయలేదని.. కానీ జైతెలంగాణ నినాదం చేసినవారిని తుమ్మల జైలు పాలుచేశారని పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు.
"పదవుల కోసం తుమ్మల అధమస్థాయికి దిగజారారు. కేసీఆర్ గురించి తుమ్మల ఇష్టారీతిన మాట్లాడటం బాధాకరం. 2014లో మంత్రి పదవి ఇచ్చి ఉండకపోతే తుమ్మల ఇప్పటికే రిటైర్ అయ్యేవారు. తుమ్మలపై ఆధారపడి కేసీఆర్ అధికారంలోకి వచ్చారా?. కేసీఆర్‌కు మంత్రి పదవి ఇప్పించినట్లు ఆరోపిస్తున్నారు. కేసీఆర్, తుమ్మల ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. కేసీఆర్‌కు తుమ్మల మంత్రి పదవి ఇప్పించారనేది హాస్యాస్పదం." - పువ్వాడ అజయ్‌కుమార్, మంత్రి