తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ బస్సులో మంత్రి పువ్వాడ, ఎంపీ నామ ప్రయాణం.. - latest news on Minister Puvvada MP travel in RTC bus

మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఎంపీ నాగేశ్వరరావుతో కలిసి ఖమ్మం నుంచి కొత్తగూడెం వరకు ప్రయాణించారు.

Minister Puvvada MP travel in RTC bus
ఆర్టీసీ బస్సులో మంత్రి పువ్వాడ, ఎంపీ నామా ప్రయాణం..

By

Published : Dec 21, 2019, 10:22 AM IST

Updated : Dec 21, 2019, 10:40 AM IST

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. స్వయంగా టికెట్టు కొనుక్కొని ఖమ్మం నుంచి కొత్తగూడెం వరకు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావుతో కలిసి బస్సులో ప్రయాణించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తల్లాడ, ఏన్కూరు, జూలూరుపాడు ప్రధాన కూడళ్లలో ప్రయాణికుల రద్దీని పరిశీలిస్తూ వెళ్లారు. వైరాలో ఎమ్మెల్యే రాములు నాయక్​తో కలిసి బస్టాండ్​ పరిసరాలను పరిశీలించారు.

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం అని ప్రజలకు తెలియజేసేందుకే ఇలా బస్సులో ప్రయాణం చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఆర్టీసీని కాపాడేందుకు ప్రజలంతా సహకరించాలని మంత్రి కోరారు.

ఆర్టీసీ బస్సులో మంత్రి పువ్వాడ, ఎంపీ నామా ప్రయాణం..

ఇదీ చదవండి: ఉన్నావ్​ కేసు: బతికున్నంత కాలం జైల్లోనే సెంగార్

Last Updated : Dec 21, 2019, 10:40 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details