రాష్ట్ర రోడ్డు రవాణా వ్యవస్థ దశ- దిశను మార్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌తో కలిసి ఖమ్మం నుంచి కొత్తగూడెం వరకు బస్‌లో ప్రయాణించారు. ప్రజల్లో ఆర్టీసీ పట్ల నమ్మకం కలిగించేందుకు.. సురక్షితమని తెలియజేసేందుకు తాను బస్సులో ప్రయాణిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సంస్థను ఆర్థికంగా పరిపుష్ఠం చేసేందుకు త్వరలోనే ఆర్టీసీలో కార్గో సేవలు ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల ఈటీవీ భారత్ ప్రతినిధి లింగయ్యతో ముఖాముఖి.
ఆర్టీసీ పట్ల నమ్మకం కలిగించేందుకే బస్సు ప్రయాణం - mp naama latest updates
ప్రజాప్రతినిధులు ఆర్టీసీ బస్సుల్లో కనీసం నెలకొకసారైనా.. ప్రయాణించాలని లేఖలు రాస్తోన్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్.. ఈరోజు ఎంపీ నామతో కలిసి ఆర్టీసీ బస్‌లో ప్రయాణించారు.
బస్సులో మంత్రి పువ్వాడ, ఎంపీ నామా