తెలంగాణ

telangana

సమస్యల పరిష్కారంలో స్థానిక సంస్థల ప్రతినిధులు చొరవ చూపాలి

సమస్యల పరిష్కారంలో స్థానిక సంస్థల ప్రతినిధులు ముందు వరుసలో ఉండాలని మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ పేర్కొన్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా పరిషత్​ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమ శాఖలపై చర్చ నిర్వహించారు.

By

Published : Dec 3, 2020, 6:43 PM IST

Published : Dec 3, 2020, 6:43 PM IST

minister puvvada meeting with local bodies representatives
సమస్యల పరిష్కారంలో స్థానిక సంస్థల ప్రతినిధులు చొరవ చూపాలి

స్థానిక సంస్థల ప్రతినిధులు.. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

ప్రధానంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమ శాఖలపై సమావేశంలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానం ఇచ్చారు. కరోనా అనంతరం మార్చిలో బడ్జెట్‌ వేసుకుని స్థానిక సంస్థలకు నిధులు మంజూరు చేస్తామని మంత్రి అన్నారు. జిల్లాలో ఇసుక అక్రమవ్యాపారాన్ని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. సమస్యల పరిష్కారంలో స్థానిక ప్రతినిధులు ముందుండాలని సూచించారు.

ఇదీ చదవండి:ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటుపై సర్కారుకు హైకోర్టు నోటీసులు

ABOUT THE AUTHOR

...view details