తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కేర్​ సెంటర్​ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ - ఖమ్మం జిల్లా వార్తలు

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ కరోనా కేర్​ సెంటర్​ను ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా బాధితుల కోసం వంద పడకల కేర్​ సెంటర్​ను ప్రారంభిస్తున్నట్టు మంత్రి తెలిపారు.

Minister Puvvada Inaugurates Corona Care Center In Paleru
కరోనా కేర్​ సెంటర్​ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

By

Published : Jul 20, 2020, 9:35 PM IST

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలంలో మద్దులపల్లి గిరిజన సంక్షేమ భవన్​లో మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ కరోనా కేర్ సెంటర్​ను ప్రారంభించారు. కరోనా వచ్చిన వారికి అత్యవసర సేవల కోసం ఈ కేర్ సెంటర్​ను ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

సుమారు వంద పడకలతో ఈ కేర్ సెంటర్​ ద్వారా కరోనా బాధితులకు చికిత్స అందించనున్నట్టు, ఆక్సిజన్​ సౌకర్యం కూడా కల్పించనున్నట్టు మంత్రి తెలిపారు. కరోనా లక్షణాలు ఉండి ఇంటిదగ్గర సౌకర్యంగా లేనివారికి వైద్యం చేసి మందులు. పోషకాహారం ఇస్తున్నామన్నారు. కరోనా వచ్చినా.. ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని మంత్రి ప్రజలకూ సూచించారు.

ఇదీ చదవండి:నరకయాతన: అద్దె ఇళ్లలో ఉండనివ్వరు.. దవాఖానాల్లో చేర్చుకోరు!

ABOUT THE AUTHOR

...view details