రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మంలో తలపెట్టిన పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. నగరంలోని బ్యాంకు కాలనీలో నిర్మించిన బాల రక్షాభవన్‌ను ప్రారంభించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా కాలనీలో మొక్కలు నాటారు.
ఖమ్మంలోని పలు కాలనీల్లో మంత్రి పువ్వాడ పర్యటన - ఖమ్మంలో మంత్రి పువ్వాడ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు
ఖమ్మంలోని పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు కాలనీల్లో మొక్కలు నాటారు.
ఖమ్మంలోని పలు కాలనీల్లో మంత్రి పువ్వాడ పర్యటన
అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. మొత్తం 24 మంది లబ్ధిదారులకు 24 లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. బల్లెపల్లి వద్ద సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. గంటకు 62 పాజిటివ్ కేసులు