వీధి వ్యాపారులకు చట్టబద్ధ గుర్తింపు ఇచ్చి.. వారు వ్యాపారం చేసుకోవటంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో 841 మంది వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం కింద రూ. 84.10 లక్షల రుణాలు పంపిణీ చేశారు.
వీధి వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం: పువ్వాడ
ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో వీధి వ్యాపారులకు రుణాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ రూ.84.10 లక్షల రుణాలు అందజేశారు.
మెప్మా ద్వారా వీధి వ్యాపారులను గుర్తించి వారికి రుణాలు ఇచ్చి ఆదుకుంటామని మంత్రి పేర్కొన్నారు. వీధి వ్యాపారుల కోసం నగరంలోని కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ పరిసరాల్లో త్వరలోనే వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వారిని ఎవ్వరూ ఇబ్బంది పెట్టకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ ఒప్పంద, పారిశుద్ధ్య కార్మికులకు బీమా పత్రాలు, కరోనా రక్షణ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో మంత్రితో పాటు జడ్పీ ఛైర్మన్ కమల్‌రాజు, ఎమ్మెల్సీ బాలసాని, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, కమిషనర్ అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి: 'గ్రేటర్ పరిధిలో 300 బస్తీ దవాఖానాల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యం'
TAGGED:
మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్